మిథునం 2026 రాశిఫలాలు ఈ ఆస్ట్రోక్యాంప్ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి!

Author: Vijay Pathak | Last Updated: Fri 7 Nov 2025 10:33:58 AM

ఈ ప్రత్యేక ఆస్ట్రోక్యాంప్ వ్యాసంలో 2026 సంవత్సరంలో మిథునరాశి వారి జీవితంలోని వివిధ ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఖచ్చితమైన అంచనాలను మీరు మిథునం 2026 రాశిఫలాలుచదువుతారు. ఈ 2026 జాతకం పూర్తిగా వేద జోతిష్యశాస్త్ర గణనల పైన ఆధారపడి ఉంటుంది మరియు గ్రహాల కదలికలు, నక్షత్రరాశుల కదకీలకు, గ్రహాల సంచారాలు మరియు ఇతర సంబంధిత పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మా అనుభవజ్ఞుడైన జోతిష్యుడు ఆస్ట్రోగురు మృగాంక్ దీనిని తయారు చేశారు. 2026లో జీవితంలోని ప్రతి రంగంలో వారు ఆశించే ఫలితాల గురించి పూర్తి సమాచారాన్ని మిథునరాశి స్థానికులకు అందించడం దీని లక్ష్యం.


हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: मिथुन 2026 राशिफल

2026 గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి!

ఆర్థికజీవితం

మిథునరాశి 2026 జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు పనికి సంబంధించిన విషయాల కోసం అనేకసార్లు ఖర్చు చేయాల్సి రావచ్చు, ఇది మీ ఆర్థిక స్థితి పైన ప్రభావం చూపుతుంది. మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ఈ సంవత్సరం మధ్య నాటికి, మీ ఆర్థిక స్థితి మరింత స్థిరంగా ఉంటుందని మరియు మీ పని ఊపండుకుంటున్న కొద్ది, మీరు ఆర్థికంగా మిమ్మల్ని మీరు బలోపేదయం చేసుకోగలుగుతారు. జూన్ 2 నునఫది అక్టోబర్ 31 వరకు, బృహస్పతి మీ రెండవ ఇంట్లో ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు,మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు స్థిర డిపాజిట్లు మరియు బ్యాంకు ఖాతాలలో మంచి మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు మరియు మీరు పొదుపు పథకాల నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి మీ మూడవ ఇంట్లోకి ప్రవేశించి మీ తొమ్మిదవ, ఏడవ మరియు పదకొండవ ఇళ్లను చూసినప్పుడు, కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. వివిధ మార్గాల ద్వారా ద్రవ్య లాభాలకు అవకాశాలు తలెత్తవచ్చు, ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ సంవత్సరం మీరు ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ నుండి లాభాలను కూడా పొందవచ్చు, కానీ మార్కెట్ ధోరణులను అధ్యయనం చేసి, మార్కెట్ నిపుణుడి నుండి మార్గదర్శకత్వం తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది.

మీ పిల్లల కెరీర్ గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? ఇప్పుడే ఆర్డర్ చేయండి: కాగ్ని- ఆస్ట్రో రిపోర్ట్!

ఆరోగ్యం

మిథునరాశి 2026 ప్రకారం ఈ సమాత్సరం మిమ్మల్ని ఆరోగ్య పరంగా పదే పదే పరీక్షిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మీ రాశి అధిపతి బుధుడు సూర్యుడు, కుజుడు మరియు శుక్రులతో పాటు ఏడవ ఇంట్లో ఉంటాడు, మొదటి ఇంట్లో తిరోగమన బృహస్పతి మరియు పదవ ఇంట్లో శని వారిపై పూర్తి కోణం ఉంటుంది. మిథునం 2026 రాశిఫలాలు ప్రకారం ఈ గ్రహ స్థానాలు ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యం పైన అదనపు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా సంవత్సరం మొదటి త్రైమాసికం ఆరోగ్య సంబంధిత సమస్యల పెరుగుదలకు దారితీయవచ్చు. మీరు మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే సమస్యలు తీవ్రమవుతాయి. జనవరి, జులై మరియు అక్టోబర్ నుండి నవంబర్ మధ్య వరకు, ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి, కాబట్టి మీరు ఈ కాలాల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం రెండవ భాగంలో, శారీరక బద్దకం కూడా పెరుగుతుంది. మీరు సోమరితనాన్ని నివారించడం, స్వీయ సంరక్షణ పైన దృష్టి పెట్టడం మరియు క్రమం తప్పకుండా యోగా లేదా శారీరక వ్యాయామం చేయడం ద్వారా, మీ ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది. మానసిక సవాళ్లను అధిగమించడానికి, ధ్యానం ద్వారా మీ మనస్సును కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. ఈ సంవత్సరం మీ ఆహారం పైన కూడా చాలా శ్రద్ద వహించడం చాలా ముఖ్యం.

మీ జాతకం ఆధారంగా ఖచ్చితమైన శని నివేదికను పొందండి!

కెరీర్

మిథునరాశి 2026 ప్రకారం ఈ సంవత్సరం మీ కెరీఎరకు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఈ సంవత్సరం మొత్తం శని మీ పడవ ఇంట్లో ఉండటం వల్ల, మీరు స్థిరమైన పనిభారం మరియు ఒత్తిడిని అనుభవించవచ్చు. సానుకూల వైపు, సంవత్సరం ప్రారంభం నుండి మీ రాశిలో బృహస్పతి ఉనికి క్రమంగా మీ నిర్ణయం తీసుకునే సామర్ధ్యాలను పెంచుతుంది. మీరు తెలివైన ఎంపికలు చేసుకుంటారు మరియు వ్యక్తులతో మీ సంబంధాలు బాలపడతాయి, ఇది మీ వృత్తిపరమైన రంగంలో విజయానికి దారితీస్తుంది. ఉద్యోగాలలో ఉన్నవారికి, కష్టపడి పనిచేయడం వల్ల ప్రతిఫలదాయకరమైన ఫలితాలు వస్తాయి. అయితే జులై 27 మరియు డిసెంబర్ 11 మధ్య, శని మీ పడవ ఇంట్లో తిరోగమనం చెందుతున్నపుడు, ఉద్యోగాలను మార్చకుండా మరియు మీ ప్రస్తుత పనిపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. బహుళ గ్రహాల ప్రభావం కారణంగా సంవత్సరం ప్రారంభంలో వ్యాపార యజమానులు తమ వ్యాపారంలో హెచ్చుతగ్గులు మరియు సవాళ్లను ఎదుర్కోవచ్చు. వ్యాపార భాగస్వాములతో కూడా కొన్ని మిశ్రమ పరస్పర చర్యలు ఉండవచ్చు. అయితే, సంవత్సరం చివరి భాగంలో మీ వ్యాపారం మంచి వృద్ది మరియు పురోగతి చూడాలని భావిస్తునారు.

వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి:2026 రాశిఫలాలు

విద్య

మిథునరాశి 2026 రాశిఫలం ప్రకారం, మిథున రాశి విద్యార్ధులు ఈ సంవత్సరం అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి, ఆరోగ్యం కూడా వారిని పరీక్షిస్తుంది, ఎందుకంటే అనారోగ్యం వారి చదువులను నేరుగా ప్రభావితం చేస్తుంది. మీరు ఎటువంటి ప్రయత్నాన్ని వదిలివేయకుండా చూసుకోవాలి మరియు మీ ఏకాగ్రతను మెరుగుపరచుకోవడం పైన దృష్టి పెట్టాలి. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం మీ మొదటి ఇంట్లో ఉంచబడుతుంది, దాని కోణం ఐదవ మరియు తొమ్మిదవ ఇళ్ల పైన ఉంటుంది, ఇది సాధారణ విద్యార్థులకు మరియు ఉన్నత విద్యను అభ్యసించే వారికి ప్రయోజనం చేసురుస్తుంది. మార్చి 11 నుండి, బృహస్పతి తిరోగమనం నుండి ప్రత్యక్ష కడలికకు మారినప్పుడు, విద్యా విజయానికి బలమైన అవకాశాలు తలెత్తతాయి మరియు మీరు మీ అధ్యయనాలలో బాగా రాణించగలరు. అయితే, అప్పుడప్పుడు అంతరాయాలు సంభవించవచ్చు, కాబట్టి మీరు వాటిని నివారించడానికి ప్రయత్నించాలి. ఉన్నత చదువులు చదువుతున్న వారికి, మొదటి త్రైమాసికం మరియు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కలం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఒక ప్రధాన అవార్డు పొందే అవకాశం కూడా ఉంది. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు సంవత్సరం మొదటి అర్ధభాగం విజయానికి అనుకూలంగా ఉండవచ్చు. మీరు విదేశాలలో చదువుకోవాలనుకుంటే మీరు సంవత్సరం మధ్యలో విజయం సాధించవచ్చు.

Click here to read in English: Gemini 2026 Horoscope

కుటుంబ జీవితం

మిథునరాశి 2026 ప్రకారం సంవత్సరం మొదటి ఆర్ధభాగం మీ కుటుంబ జీవితానికి కొంత సవాలుగా ఉండవచ్చు. శని యొక్క కోణం ఏడాది పొడవునా మీ నాల్గవ ఇంటిపై ఉంటుంది, ఇది ఇంట్లో ఇబ్బందులకు మరియు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం రెండవ అర్ధభావం సాపేక్షంగా అనుకూలంగా ఉంటుంది మరియు మీ జీవితానికి ఆనందాన్ని తెస్తుంది. బృహస్పతి మీ తెలివైన నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని పెంచుతుంది, ఇది కుటుంబ విషయాలను తెలివిగా నిర్వహించడానికి మరియు కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించడానికి మీకు సహాయపడుతుంది. జూన్ 2 నుండి బృహస్పతి మీ రెండవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, కుటుంబ సభ్యులా మధ్య పరస్పర ప్రేమ మరియు అంకితభావం పెరుగుతుంది మరియు దీర్ఘకాలిక సమస్యలు మస్యకబారడం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మీ తోబుట్టువులు కొన్ని ఇబ్బందులు మరియు సవాళ్లను ఎదుర్కోవచ్చు మరియు వారికి మీ సహాయం పదేపదే అవసరం కావచ్చు. మీరు మీ బాధ్యతలను నెరవేర్చాలి మరియు వారికి మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉండాలి, ఎందుకంటే అలా చేయడం వల్ల వారితో మీ బంధం బాలపడుతుంది మరియు కుటుంబ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మిథునం 2026 రాశిఫలాలు ప్రకారం అక్టోబర్ 31 నుండి, బృహస్పతి మీ మూడవ ఇంట్లోకి ప్రవేశించి కేతువుతో కలిసి ఉంటాడు. ఈ సమయంలో మీ కుటుంబంలో శుభ సంఘటనలు జరగవచ్చు మరియు తోబుట్టువుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ఈ సంవత్సరం మీ తండ్రికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. 

వివాహ జీవితం

మిథునరాశి 2026 ప్రకారం ఈ సంవత్సరం మీ వివాహ జీవితంలో ఒడిదుడుకుల మిశ్రమాన్ని తెస్తుంది. సంవత్సరం ప్రారంభంలోనే, నాలుగు గ్రహాలు, సూర్యుడు, కుజుడు బుద్ధుడు మరియు శుక్రుడు ఏడవ ఇంట్లో ఉంటారు. తిరోగమన బృహస్పతి మొదటి ఇంటి నుండి తన దృష్టిని మరియు పడవ ఇంటి నుండి శనిని ఉంచుతారు. ఈ ఆరు గ్రహాల ప్రభావం ఏడవ ఇంటి పైన ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ మధ్య సామరస్యం లేకపోవడం మరియు పరస్పర సమస్యలు పెరగడం జరగవచ్చు. కుటుంబ వాతావరణం కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి మీరు మీ సంబంధాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. మీరు ఎంత తెలివిగా వ్యవహరిస్తే, అటువంటి సమస్యలను అంతా బాగా నివారించవచ్చు. మొదటి త్రైమాసికం తర్వాత ఈ సమస్యలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. మార్చు 11 నుండి, బృహస్పతి నేరుగా మారినప్పుడు, అది మీ ఏడవ ఇంట్లో తన సొంత రాశి అయిన ధనుస్సును చూస్తుంది, ఇది మీ వైవాహిక బంధాన్ని మరింతగా పెంచుతుంది, సవాళ్లను తగ్గిస్తుంది మరియు మీ సంబంధం సజావుగా ముందుకు సాగడానికి సహాయపడుతుంది. డిసెంబర్ 5 నుండి, రాహువు మీ ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, మీ అత్తమామల కుటుంబంలో ఒక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం మీకు లభిస్తుంది. మీ ప్రాముఖ్యతను కూడా గ్రహించవచ్చు, ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది.

ప్రేమజీవితం

మిథునరాశి 2026 జాతకం ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు మీ ప్రేమ జీవితంలో చాలా సానుకూల ఫలితాలను పొందవచ్చు. బృహస్పతి కోణం ఐదవ ఇంటి పైన ఉంటుంది మారిఊ ఐదవ ఇంటి అధిపతి శుక్రుడు మీ ఏడవ ఇంట్లో కుజుడు, సూర్యుడు మరియు బుధులతో పాటు ఉంటాడు. అందువల్ల బృహస్పతి కోణం ఐదవ మరియు ఏడవ ఇళ్ల పై ఉంటుంది. ఈ అమరిక మీ ప్రేమ వికాశించడానికి మరియు వృద్ది చెందడానికి సహాయపడుతుంది, మీకు మరియు మీ భాగస్వామికి మధ్య దూరాలను తగ్గిస్తుంది.మీ ప్రేమ సంబంధం వివాహానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఒంటరిగా ఉన్నవారు కూడా ఈ సంవత్సరం పెళ్లి గంటలు వినవచ్చు. మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు తగినంత అవకాశాలు లభిస్తాయి. వారితో పరస్పర అవగాసహనను మెరుగుపరచడానికి పని చేయండి మరియు వీలైనంత ఎక్కువగా వారిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తూనే ఉంటుంది, మిమ్మల్ని మీ భాగస్వామికి మరింత దగ్గర చేస్తుంది. మిథునం 2026 రాశిఫలాలు ప్రకారం సంవత్సరం చివరి భాగంలో మీరు మీ సంబంధానికి కొత్త దిశానిర్దేశం చేయడానికి ప్రయత్నించవచ్చు మరియు వివాహ బంధంలోకి ప్రవేశించవచ్చు. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, సంవత్సరం రెండవ త్రైమాసికంలో మీ సంబంధంలో మూడవ వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండటం, ఎందుకంటే ఇది అపార్థాలకు కారణమవుతుంది. మీరు విషయాలను తెలివిగా నిర్వహిస్తే రాబోయే సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

పరిహారాలు

  • ప్రతిరోజూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి.
  • బుధవారం రోజున మీ చేతులతో ఆవుకు మొత్తం పెసర తినిపించండి. పప్పును ఒక రోజు ముందుగానే నీటిలో నానబెట్టండి.
  • మిథునం 2026 రాశిఫలాలు ప్రకారం శుక్రవారం రోజున యువతుల పాదాలను టాకీ వారి ఆశీర్వాదం పొందండి, ఎందుకంటే ఇది మీకు పురోగతిని తెస్తుంది. 
  • శనివారం రోజున పేద వ్యక్తులకి సహాయం చేయండి. 

నాణ్యమైన రత్నాలు, యంత్రాలు మరియు జ్యోతిష సేవలను ఆన్‌లైన్‌లో కొనండి: ఇక్కడ క్లిక్ చేయండి!

ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. ఆస్ట్రోక్యాంప్ తో కనెక్ట్ అయి ఉన్నందుకు ధన్యవాదాలు.

తరచుగా అడుగు ప్రశ్నలు

1. మిథునరాశి అధిపతి ఎవరు?

బుధుడు.

2. 2026 లో మిథునరాశి స్థానికులు ఏ నివారణలు పాటించాలి?

శనివారాల్లో పేదవారికి సహాయం చేయండి.

3. మిథునరాశి స్థానికుల కుటుంబ జీవితం ఎలా ఉంటుంది?

2026 సంవత్సరం మొదటి అర్ధభాగం మీ కుటుంబ జీవితానికి కొంత సవాలుగా ఉండవచ్చు.

More from the section: Horoscope