తులా 2026 రాశిఫలాలు ఈ ఆస్ట్రోక్యాంప్ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి!

Author: Vijay Pathak | Last Updated: Thu 13 Nov 2025 4:32:10 PM

ఈ ప్రత్యేక ఆస్ట్రోక్యాంప్ వ్యాసంలో 2026 సంవత్సరంలో తులారాశి వారి జీవితంలోని వివిధ ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఖచ్చితమైన అంచనాలను మీరు తులా 2026 రాశిఫలాలుచదువుతారు. ఈ తులారాశి 2026 జాతకం పూర్తిగా వేద జోతిష్యశాస్త్రం యొక్క గణనలపై ఆధారపడి ఉంటుంది మరియు నక్షత్రాల కదలిక, గ్రహాల సంచారము మరియు నక్షత్ర రాశుల స్థానాన్ని పరిగణనలోకి తీసుకొని మన అనుభవజ్ఞులైన జోతిష్యులు జోతిష్యుడు ఆస్ట్రోగురు మృగాంక్  దీనిని తయారు చేశారు 2026 సంవత్సరంలో తులారాశి స్థానికులు జీవితంలోని వివిధ రంగాలలో ఎలాంటి ఫలితాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.


 

2026 గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి!

తులారాశి ఫలాలు 2026 ప్రకారం 2026 సంవత్సరంలో ప్రేమ జీవితం, వైవాహిక జీవితం మరియు కుటుంబ జీవితం వంటి జీవితంలోని వివిధ అంశాలలో పరిస్థితులు  ఎలా ఉంటాయో మీరు తెలుసుకుంటారు. మీ కెరీర్ ఏ దిశలో పురోగమిస్తుంది, మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారా లేదా వ్యాపారంలో విజయం సాధిస్తారా, మీరు ఆర్థికంగా ఎలా రాణిస్తారు, మీరు సంపదను కూడబెట్టుకోగలరా లేదా మరియు మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా మీరు నేర్చుకుంటారు.ఈ విషయాలన్నింటినీ వివరంగా తెలుసుకోవడానికి, తులారాశి ఫలాలు 2026 ప్రకారం తులారాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉంటుందో అర్ధం చేసుకుని ముందుకు సాగండి.

हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: तुला राशि 2026 राशिफल

ఆర్థికజీవితం

ఆర్థిక జీవితం గురించి మాట్లాడుకుంటే తులారాశి 2026 జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం శని ఏడాది పొడవునా ఆరవ ఇంట్లో ఉంటాడు మరియు పన్నెండవ ఆరవ ఇంట్లో ఉంటాడు మరియు పన్నెండవ ఇంటి పైన దృష్టి పెడతాడు, దీని కారణంగా మీ ఖర్చులు కొనసాగుతాయి. మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన కొంత స్థిర వ్యయం ఉంటుంది మరియు ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ 31 నుండి, బృహస్పతి మీ పదకొండవ ఇంటికి వెళ్లి మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తాడు. కేతువు ఈ ఇంట్లో డిసెంబర్ 5 వరకు ఉంటాడు, ఇది సంపదను కూడా తెస్తుంది, ఈ సంవత్సరంలో మీకు సంపద పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు, కానీ అప్పుడప్పుడు ఖర్చులు కూడా పెరుగుతాయి, రాహువు ఐదవ ఇంట్లో ఉన్నప్పుడు, మీరు అనవసరమైన ఖర్చులకు పాల్పడతారు మరియు ప్రదర్శన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. రిస్క్ తో నిండి ఉంటుంది కాబట్టి ఈ విషయం పై నిపుణుడి సలహా తీసుకున్న తర్వాతే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలని మీకు సలహా ఇస్తున్నారు.

మీ పిల్లల కెరీర్ గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? ఇప్పుడే ఆర్డర్ చేయండి: కాగ్ని- ఆస్ట్రో రిపోర్ట్!

ఆరోగ్యం

ఈ సంవత్సరం ఆరోగ్య పరంగా కొంచెం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. శని ఏడాది ఆరవ ఇంట్లో ఉంటాడు మరియు రాహువు కూడా మీ ఐదవ ఇంట్లో 5 వ తేదీ వరకు ఉంటాడు మరియు తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి జూన్ 2 వరకు వారి పై తన దృష్టిని ప్రయోగిస్తాడు. రాహువు మరియు శని స్థానం ప్రారంభంలో మీకు శారీరక సమస్యలను కలిగించవచ్చు మరియు కడుపు సంబంధిత వ్యాధులకు కారణం కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు, ఇన్స్పెక్షన్ లకి కారణమవుతాయి, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు సంభవించవచ్చు, బృహస్పతి కోణం రాహువు ప్రభావాన్ని కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుంది, దీని కారణంగా ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు కొనసాగుతాయి. తులా 2026 రాశిఫలాలు ప్రకారం ఆరవ ఇంట్లో శని ఉండటం వల్ల అనారోగ్యానికి కారణం కావడమే కాకుండా ఆ అనారోగ్యంతో పోరాడటానికి ధైర్యం మరియు దాని నుండి బయటపడే అవకాశం కూడా లభిస్తుంది, కాబట్టి, మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.మీరు మీ స్వంత ఆరోగ్యాన్ని విస్మరిస్తే,మీరు వ్యాధుల బారిన పడతారని భావించండి. సంవత్సరం ప్రారంభంలో, భుజం, మరియు కీళ్ల నొప్పి లేదా చెవి నొప్పి వంటి సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం తర్వాత అవి తగ్గిపోతాయి.

మీ జాతకం ఆధారంగా ఖచ్చితమైన శని నివేదికను పొందండి!

కెరీర్

మీ కెరీర్ ని పరిశీలిస్తే ఉద్యోగస్తులకు నిరంతరం కష్టపడి పనిచేసే పరిస్థితి ఉంటుంది. మీ పైన కొంత పని ఒత్తిడి ఉండవచ్చు, కానీ మీరు ఆ పనికి  భయపడరు కానీ దానిని అవకాశంగా తీసుకుంటారు. మీరు కష్టపడి పనిచేస్తారు మరియు ఆ కష్టార్జితం నుండి మీరు ప్రయోజనం పొందుతారు. సంవత్సరం మధ్యలో ముఖ్యంగా జూన్ మరియు అక్టోబర్ మధ్య, మీరు మీ కార్యాలయంలో అతి విశ్వాసానికి బలి కాకుండా ఉంటారు. అక్టోబర్ చివరి నుండి డిసెంబర్ వరకు, మీరు మీ కార్యాలయంలో మంచి పేరు పొందవచ్చు,మీకు ప్రమోషన్ పొందవచ్చు, దీనితో పాటు మీరు సీనియర్ అధికారుల సహవాసాన్ని పొందవచ్చు మరియు వారితో మంచి సంబంధాలను పెంచుకోవచ్చు. మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే, మీరు ప్రశాంతమైన మనస్సుతో పని చేయాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార సమస్యలను ఎదురుకావచ్చు. మీరు మీ వ్యాపార భాగస్వాములతో సంబంధాలను మెరుగుపరచుకోవడం పై కూడా దృష్టి పెట్టాలు. మీరు రియల్ ఎస్టేట్, బ్రోకరేజ్ మరియు ఫైనాన్స్ రంగంలో పనిచేస్తుంటే, ఈ సంవత్సరం మీరు ప్రత్యేక ప్రయోజనాలను పొందే స్థితిలో ఉండవచ్చు.

వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి:2026 రాశిఫలాలు 

విద్య

తులారాశి విద్యార్ధుల గురించి మాట్లాడుకుంటే డిసెంబర్ 5 వరకు రాహువు మీ ఐదవ ఇంట్లో ఉంటాడు మరియు సంవత్సరం మొత్తం నాల్గవ ఇంటి అధిపతి శని ఆరవ ఇంట్లో ఉంటాడు. గ్రహాల యొక్క ఈ స్థానం మీ మనస్సు చాలా వేగంగా పనిచేస్తుంది, మీ తెలివితేటలు చాలా బలంగా ఉంటాయని సూచిస్తుంది, మీరు ఒకసారి చదివిన లేదంటే అర్ధం చేసుకున్నది మీకు వెంటనే అర్థం అవుతుంది, మీ మనస్సు చాలా వేగంగా పనిచేస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. మీరు మీ శక్తిని ఇతర ప్రాంతాలకు మళ్లిస్తే, మీ దృష్టి చదువు నుండి మళ్లుతుంది మరియు మీరు చదువులో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు, లేకుంటే రాహువు మరియు శని యొక్క ఈ స్థానం మిమ్మల్ని కష్టపడి పనిచేసేలా చేస్తుంది. మీరు మీ చదువులో కొంత ప్రత్యేక హోదాను సాధించవచ్చు. మీరు పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే, శని అనుగ్రహంతో, కష్టపడి పనిచేసే వారు ఈ సంవత్సరం మంచి విజయాన్ని పొందవచ్చు. తులా 2026 రాశిఫలాలు ప్రకారం మీరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లయితే, సంవత్సరం ప్రారంభం మీకు గొప్పగా ఉంటుంది. గురు గ్రహం ఆశీస్సులతో, మీరు విద్యలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీరు విదేశాలలో చదువుకోవాలనుకుంటే, మీరు సంవత్సరం మధ్యకాలం వరకు వేచి ఉండాల్సి రావచ్చు.

Click here to read in English: Libra 2026 Horoscope

కుటుంబ జీవితం

తులారాశి వారికి 2026 సంవత్సరం మీ కుటుంబ జీవితంలో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. నాల్గవ ఇంటి అధిపతి శని ఇంట్లో కూర్చోవడం వల్ల మీ తల్లికి ఆరోగ్యం ఉండవచ్చని సూచిస్తుంది.  ఆమె వాటి నుండి బయటపడతానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. సౌకర్యాలకు సంబంధించి కొన్ని వివాదాలు తలెట్టవచ్చు. కుటుంబంలో ఆస్తి సంబంధిత వివాదాలు తలెట్టవచ్చు, ఇది పరస్పర వివాదానికి దారితీయవచ్చు. సంవత్సరం ప్రారంభంలో మీ సోదరులు మరియు సోదరిమనులకు మీ సహాయం అవసరం కావచ్చు, కాబట్టి వారితో స్నేహపూర్వక సంబంధాలను సొనసాగించండి మరియు వారికి సహాయం చేయండి. మీకు ఎక్కడ అవసరం అనిపిస్తే మీరు వారికి అండగా నిలబడి వారికి సహాయం చేయాలి, ఇది మీ నైతిక వీధి మరియు ఇది వారితో మీ సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది. వారి సాహవాసం మీ జీవితంలోని అనేక రంగాలలో మీకు గొప్ప విజయాన్ని తెస్తుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల సంవత్సరం మధ్యలో కుటుంబ జీవితంలో ఆనందం మరియు ప్రేమ భావన ఉంటుంది.  కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకుంటారు మరియు ఇంట్లో ఆనందం ఉంటుంది. సంవత్సరం చివరి నెలల్లో, ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది, దీని కారణంగా అందరూ సంతోషంగా ఉంటారు మరియు ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా పూర్తి చేయబడతాయి. 

వివాహ జీవితం

తులారాశి ఫలం 2026 ప్రకారం ఈ సంవత్సరం మీ వివాహ జేవితంలో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది ఎందుకంటే శని ఏడాది పొడవునా మీ ఆరవ ఇంట్లో ఉంటాడు మరియు రాహువు కూడా ఐదవ ఇంట్లో ఉంటాడు. ఈ గ్రహాల కారణంగా ఒక వైపు మీకు మీ జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు గొడవలు వస్తాయి మరియు కొన్ని విషయాల పై మీ ఇద్దరి మధ్య విభేదాలు ఉండవచ్చు, ఇది చెదను పెంచుతుంది. రాహువు ప్రభావం కారణంగా మీ దృష్టి మళ్లించబడుతుంది మరియు మీరు మీ భాగస్వామి కాకుండా మరొకరి పైన ఆసక్తి చూపవచ్చు.  మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమను చూపించాలి మరియు అవసరమైనప్పుడు సవాళ్లను ఎదుర్కోవడంలో అతనికి లేదా ఆమెకు సహాయం చేయాలి. ఆదర్శ జీవిత భాగస్వామిగా మీరు ఖచ్చితంగా అతని మద్దతును పొందుతారు. అక్టోబర్ చివరి నుండి డిసెంబర్ వరకు బృహస్పతి కోసం మీ ఏడవ ఇంటి పైన పడుతుంది మరియు మీ వివాహ జీవితంలో వచ్చే అన్ని సవాళ్లు వాటన్నింటినీ తొలగించి, మీ సంబంధంలో ప్రేమను మళ్ళీ పెంచుతాయి.

ప్రేమజీవితం

ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు మీ ప్రేమ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారని అంచనా. ఐదవ ఇంట్లో రాహువు ఉండటం వలన మీరు ప్రేమలో పిచ్చిగా ఉంటారని సూచిస్తుంది. మీ జీవితంలో ప్రేమకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు, మీరు చంద్రుడిని మరియు నక్షత్రాలను తీసుకురావడం వంటి పనులు చేస్తారు, ఇది మీ ప్రియమైన వ్యక్తికి చాలాసార్లు నవ్వే అవకాశం ఇస్తుంది మరియు చాలా సార్లు అతను లేదంటే ఆమె మీ పట్ల ఎక్కువ ప్రేమను అనుభవిస్తాడు. తులా 2026 రాశిఫలాలు ప్రకారం బృహస్పతి కోణం కూడా మీ ఐదవ ఇంట్లో ప్రారంభం నుండి మధ్య వరకు ఉంటుంది, దీని కారణంగా మీ ప్రేమ వికసించి వృద్ది చెందుతుంది. సంబంధం బలంగా మారుతుంది, ఒకరి పైన ఒకరు నమ్మకం కూడా పెరుగుతుంది. ఇది మీ సంబంధానికి కొత్త శక్తిని తెస్తుంది మరియు మీరు మారిఊ మీ ప్రియమైన వ్యక్తి సుదీర్ఘమైన మంచి ప్రయాణాలకు వెళతారు మరియు గంటల తరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, ఇది మీ సంబంధాన్ని పరిపక్వం చేస్తుంది. మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఈ గ్రహ స్థానం ప్రేమలో ఏవైనా తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉండాలని సూచిస్తుంది ఎందుకంటే అవి నెరవేరాకపోతే మీరు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. సంవత్సరం మధ్యలో, జూన్ నుండి అక్టోబర్ వరకు మీరు మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పరిహారాలు

  • మీరు శుక్ర యంత్రాన్ని ప్రతిష్టించి,దానిని నిర్దేశించిన పద్ధతిలో పూజించాలి.
  • బుధవారం సాయంత్రం ఆలయంలో నల్ల నువ్వులు దానం చేయండి.
  • తులా 2026 రాశిఫలాలు ప్రకారం బుధవారం రోజున నపుంసకుల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు.
  • శుక్రవారం రోజున ఖీర్ తయారు చేసి, దానిని అమ్మ భగవతికి సమర్పించి, తరువాత ప్రసాదాన్ని స్వీకరించండి.

నాణ్యమైన రత్నాలు, యంత్రాలు మరియు జ్యోతిష సేవలను ఆన్‌లైన్‌లో కొనండి: ఇక్కడ క్లిక్ చేయండి!

ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. ఆస్ట్రోక్యాంప్ తో కనెక్ట్ అయి ఉన్నందుకు ధన్యవాదాలు.

తరచుగా అడుగు ప్రశ్నలు 

1.2026 సంవత్సరాన్ని పాలించే గ్రహాలు?

2026 సంవత్సరాన్ని కలిపితే సూర్యుడు అధిపతి అయిన సంఖ్య 1 వస్తుంది.

2.తులారాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?

మీరు మీ ప్రేమ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు.

3. 2026 సంవత్సరంలో తులారాశి వారు ఏమి చేయాలి?

బుధవారం నపుంసకుల ఆశీర్వాదం పొందండి.

More from the section: Horoscope