Author: Vijay Pathak | Last Updated: Fri 7 Nov 2025 11:42:38 AM
ఈ ప్రత్యేక ఆస్ట్రోక్యాంప్ వ్యాసంలో 2026 సంవత్సరంలో వృషభరాశి వారి జీవితంలోని వివిధ ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఖచ్చితమైన అంచనాలను మీరు వృషభం 2026 రాశిఫలాలుచదువుతారు. 2026 కి సంబంధించిన ఈ అంచనా పూర్తిగా గ్రహాల గణనలు, గ్రహాల సంచారము, నక్షత్రాల కదలిక మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకుని వేద జ్యోతిష్యశాస్త్రం పై ఆధారపడి ఉంటుంది మరియు దీనిని మా జోతిష్యుడు ఆస్ట్రో గురు మ్రగాంక్ తయారు చేశారు. ఈ వృషభ రాశి 2026 జాతకం ద్వారా, 2026 సంవత్సరంలో వృషభ రాశి స్థానికులు జీవితంలోని వివిధ రంగాలలో ఎలాంటి ఫలితాలను పొందవచ్చో మీరు తెలుసుకుంటారు.
2026 గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి!
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: वृषभ राशि 2026 राशिफल
వృషభరాశి వారి ఆర్థిక జీవితం గురిచి ట్లాడుకుంటే వృషభరాశి 2026 జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా ప్రగతిశీలంగా ఉంటుందని రుజువు అవుతుంది. మీరు ఈ సంవత్సరం ముందుకు సాగుతున్న కొద్దీ, మీరు మెరుగైన ఆర్థిక స్థితిని పొందుతారు. శని సంవత్సరం పొడవునా మీ పదకొండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు. గ్రహాల ఈ స్థానం మిమ్మల్ని ఆర్థిక సవాళ్ల నుండి బయటపడేస్తుంది మరియు మీ ఆదాయానికి మంచి పెరుగుదలను ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు పదోన్నతి పొందడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు ఎనిమిదవ ఇంట్లో కూర్చుని రెండవ ఇంట్లో ఉండటం వల్ల కొంత రహస్య సంపద లభిస్తుంది. జూన్ 2 నుండి, బృహస్పతి మీ మూడవ ఇంట్లో దాని ఉచ్ఛ రాశి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు, అక్కడ నుండి అది మీ ఏడవ, తొమ్మిదవ మరియు పదకొండవ ఇంట్లో దృష్టి పెడుతుంది, ఇది మీ అదృష్టాన్ని బాలపరుస్తుంది. మీ వ్యాపారం అభివృద్ది చెందుతుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది మరియు మీ ఆదాయం పెరుగుతుంది, ఇది 2026 సంవత్సరంలో మీ ఆర్థిక జీవితాన్ని సంపన్నం చేస్తుంది.
మీ పిల్లల కెరీర్ గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? ఇప్పుడే ఆర్డర్ చేయండి: కాగ్ని- ఆస్ట్రో రిపోర్ట్!
వృషభరాశి 2026 ప్రకారం ఈ సంవత్సరం ఆరోగ్య పరంగా హెచ్చు తగ్గులతో నిండి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో మీ రాశిచక్ర అధిపతి శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు, కుజుడు మరియు బుధుడు మరియు వృద్దికి కారకుడైన తిరోగమన బృహస్పతి రెండవ ఇంట్లో కూర్చుని, పదకొండవ ఇంట్లో కూర్చున్న శని కూడా వారి వైపు చూస్తాడు. మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో కడుపు సంబంధిత సమస్యలు మరియు రహస్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మరియు మీ ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకుంటే, మీరు సమస్యలతో చుట్టుముట్టబడతారు. జూన్ 2 నుండి, బృహస్పతి మీ మూడవ ఇంట్లోకి వచ్చి ఈ పరిస్థితులను కొంతవరకు తగ్గిస్తుంది మరియు అక్టోబర్ 31న, అది సింహరాశిలో కేతువుతో పాటు మీ నాల్గవ ఇంట్లోకి సంచరిస్తుంది. వృషభం 2026 రాశిఫలాలు ప్రకారం ఈ సమయంలో ఛాతీ సంబంధిత సమస్యలు మరియు గుండె సంబంధిత సమస్యలు మిమ్మల్ని పట్టుకుంటాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి. నాడీ వ్యవస్థ మరియు గుండెకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, మీరు క్రమం తప్పకుండా వ్యాయామం మరియు ప్రాణాయామంపై దృష్టి పెట్టాలి.
Click here to read in English: Taurus 2026 Horoscope
మీ జాతకం ఆధారంగా ఖచ్చితమైన శని నివేదికను పొందండి!
వృషభరాశి 2026 ప్రకారం ఈ సంవత్సరం కెరీర్ పరంగా మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 5 వరకు రాహువు మీ పదవ ఇంట్లో ఉంటాడు మరియు శని మీ పదకొండవ ఇంట్లో ఈ సంవత్సరం మొత్తం ఉంటాడు. మీ పనిలో వేగం పెరుగుతుంది. ఇతరులకు కష్టంగా ఉండే పనిని మీరు ఒక నిమిషంలో పరిష్కరిస్తారు, దీని కారణంగా మీరు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. మీ సీనియర్ అధికారులు మీ పనితో సంతోషంగా ఉంటారు మరియు వారి మద్దతు మీకు లభిస్తుంది, ఇది సంవత్సరం మధ్యలో మీకు మంచి పురోగతి లభించే అవకాశాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా జూన్ మరియు ఆగస్టు మధ్య మీకు పదోన్నతి లభిస్తుంది. మీరు వ్యాపారం చేస్తునట్టు అయితే సంవత్సరం మొదటి త్రైమాసికం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి ఎటువంటి పెద్ద చర్యలు తీసుకోకుండా ఉండండి. ఆ తర్వాత పరిస్థితులు క్రమంగా మారుతాయి. జూన్ 2 నుండి, బృహస్పతి కూడా మూడవ ఇంటి నుండి వచ్చి ఏడవ ఇంటిని చూస్తాడు మరియు ఆదాయ గృహాన్ని కూడా చూస్తాడు. దీని కారణంగా, మీ వ్యాపారంలో నిరంతర పురోగతి ఉంటుంది మరియు వ్యాపారం కొత్త ఎత్తులను చేరుకోవచ్చు. ఈ సంవత్సరం చివరి భాగంలో మీ కెరీర్‌కు మరింత అనుకూలంగా కనిపిస్తుంది. మీ కెరీర్‌ను మరింత మెరుగుపరచుకోవడానికి మీరు కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవడంపై కూడా దృష్టి పెట్టాలి.
వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి:2026 రాశిఫలాలు
వృషభరాశి విద్యార్థులకు వృషభరాశి 2026 రాశిఫలం ప్రకారం 2026 సంవత్సరం సమస్యలను తెస్తుంది కానీ, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ సవాళ్లను అధిగమించిన తర్వాత, మీరు గొప్ప విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో ఐదవ ఇంటి అధిపతి బుధుడు మీ ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు, కుజుడు మరియు శుక్రుడితో కలిసి కూర్చుంటాడు మరియు తిరోగమన బృహస్పతి కూడా వారి వైపు చూస్తాడు, దీని కారణంగా విద్యలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, మీ విద్య సంపన్నంగా ఉంటుంది. శని ఏడాది పొడవునా మీ ఐదవ ఇంటి వైపు చూస్తాడు మరియు మిమ్మల్ని తీవ్రంగా పరీక్షిస్తాడు. మీరు సోమరితనాన్ని వదులుకుని నిరంతరం కష్టపడి పనిచేయవాల్సి ఉంటుంది ఎందుకంటే శని కష్టపడి పనిచేయకుండా ఏమీ ఇవ్వడు. మీ లరుషి మాత్రే మీ విజయ కథను రాస్తుంది. సంవత్సరం మధ్యలో మీరు మీ విద్యలో గొప్ప విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్దామవుతుంటే, ఈ సంవత్సరం మీరు సంవత్సరం మధ్యలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు. మీరు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లయితే, ఈ సంవత్సరం మొత్తం మీకు విజయవంతమవుతుంది మరియు విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే జులై మరియు ఆగస్టు మధ్య మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది.
వృషభరాశి 2026 ప్రకారం 2026 సంవత్సరం మీ కుటుంబ జీవితంలో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. సంవత్సరం మొదటి అర్ధభాగంలో, బృహస్పతి మార్చి 11 వరకు తిరోగ్యమని స్థితిలో ఉంటాడు మరియు ఆ తర్వాత జూన్ 2 వరకు మీ రెండవ ఇంట్లో ప్రత్యక్ష స్థితిలో ఉంటాడు. మీ కుటుంబ జీవితం బాగానే ఉంటుంది కానీ సంవత్సరం ప్రారంభంలో నాలుగు గ్రహాలు మీ ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల, కుటుంబ సంబంధాలలో మరియు కుటుంబ సభ్యులలో కొంత ఒడిడిదికులు ఉండవచ్చు. మీ తల్లి ఆరోగ్యం మరియు ప్రవర్తన హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మీరు ఆమె ఆరోగ్యం గురించి కూడా కొంత ఆందోళన చెందవచ్చు. అక్టోబర్ 31న, బృహస్పతి మీ నాల్గవ ఇంట్లోకి సంచరిస్తాడు. ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు, కాబట్టి మీరు ఆమె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సంవత్సరం చివరి భాగంలో చాలాసార్లు కుటుంబంతో సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి మరియు మీరు తీర్థయాత్ర స్థలాన్ని సందర్శించే అవకాశం కూడా లభిస్తుంది. వృషభం 2026 రాశిఫలాలు ప్రకారం మీ సోదరులు మరియు సోదరిమణు లతో మీ సంబంధాలు సంవత్సరం మధ్యలో చాలా మధురంగా ఉంటాయి మరియు మీకు వారి నుండి మద్దతు లభిస్తుంది.
వృషభరాశి 2026 ప్రకారం వైవాహిక స్థితి మధ్యస్తంగా ఫలిటవంతంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీరు మీ అత్తమామల కార్యక్రమానికి హాజరు కావలసి ఉంటుంది, ఇది కుటుంబం మరియు అత్తమామల మధ్య పరస్పర సమన్వయాన్ని మెరుగుపరుచుకోవడానికి మీకు అవకాశం ఇస్తుంది. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య కొంత కక్ష తలెట్టవచ్చు, అది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది కానీ మీరు మీ పరిస్థితులపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తారు. జూన్ 2 నుండి, బృహస్పతి మీ మూడవ ఇంట్లోకి సంచరిస్తాడు మరియు అక్కడి నుండి దాని కోణం మీ ఏడవ ఇంట్లో ఉంటుంది, దీని కారణంగా వైవాహిక సంబంధాలలో సమస్యలు ముగుస్తాయి మరియు పరస్పర ప్రేమ మరియు అంకితభావం పెరుగుతుంది. మీరు ఒకరికొకరు మద్దతు ఇస్తారు మరియు మీ జీవిత భాగస్వామి మీ కోసం చాలా చేస్తారు. మీ సంబంధం బలంగా మారుతుంది, ఇది సవాళ్లను తొలగించి మిమ్మల్ని ఒకరికొకరు దగ్గర చేస్తుంది, ఇది కుటుంబ జీవితం వృద్ది చెందే సమయం అవుతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు కొన్ని ఉపయోజనకరమైన సలహాలు కూడా లభిస్తాయి, అది మిమ్మలని బాలపరుస్తుంది మరియు మీరు ప్రతి పనిని చాలా కష్టపడి పూర్తి చేయగలుగుతారు. మీ కుటుంబ సభ్యుని విషయంలో ఏదైనా సమస్య ఉండే, మీరు దానిని పరస్పర అంగీకారంతో చర్చించడం ద్వారా పరిష్కరిస్తారు మరియు ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది.
వృషభరాశి 2026 జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీకు ఆరోగ్యకరమైన ప్రేమ సంబంధం ఉంటుంది. 2026 సంవత్సరం ప్రారంభంలో, మీ ప్రేమ జీవితం మీకు కొన్ని మంచి భావాలు ఉంటాయి మరియు మీ ప్రియమైన వ్యక్తికి దగ్గరగా ఉన్నట్లు మీరు భావిస్తారు. వృషభం 2026 రాశిఫలాలు ప్రకారం మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీరు గ్రహిస్తారు, మీరు అతని/ఆమె ప్రేమను అనుభవించగలరు మరియు అతని/ఆమె వైపు ఆకర్షితులవుతారు. మీరు మీ ప్రేమ భాగస్వామికి మీ సమయాన్ని ఎక్కువగా కేటాయించడానికి ఇష్టపడతారు. ప్రేమ విషయాలలో బయట వ్యక్తి నుండి ఎలాంటి సలహా తీసుకోకుండా ఉండండి ఎందుకంటే అది మీకు ప్రయోజనానికి బదులుగా నష్టాన్ని కలిగించవచ్చు మరియు మీరు కలత చెందవచ్చు. సంవత్సరం ప్రారంభంలో మీ ప్రియమైన వారి ఆరోగ్యం క్షీణించినప్పుడు వారికి సహాయం చేయండి మరియు వారి అనేక పనులు అడ్డంకులుగా ఉన్నప్పుడు వారికి సహాయం చేయండి, ఇది వారి హృదయాలలో మీకు ఎక్కువ స్థానాన్ని సృష్టిస్తుంది.
నాణ్యమైన రత్నాలు, యంత్రాలు మరియు జ్యోతిష సేవలను ఆన్‌లైన్‌లో కొనండి: ఇక్కడ క్లిక్ చేయండి!
ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. ఆస్ట్రోక్యాంప్ తో కనెక్ట్ అయి ఉన్నందుకు ధన్యవాదాలు.
1. వృషభరాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?
ఈ సంవత్సరం వారికి మంచి ప్రేమ సంబంధాలు ఉంటాయి.
2. 2026 సంవత్సరం విద్యకు ఎలా ఉంటుంది?
2026 సంవత్సరం వారికి సమస్యలను తెస్తుంది.