Author: Vijay Pathak | Last Updated: Sun 4 Aug 2024 11:11:04 AM
ఈ ఆస్త్రోక్యంప్ ఆర్టికల్ ద్వారా కర్కాటక 2025 రాశిఫలాలు జాతకాన్ని చదవడం ద్వారా ఈ సంవస్త్రం కర్కాటకరాశి వ్యక్తులకు తమ జీవితంలో ఎలాంటి మార్పులను ఆశించవొచ్చో మీరు తెలుసుకోండి. మీరు వాటికి సంబంధించిన అన్ని వివరణాత్మక అంచనాల గురించి తెలుసుకుంటారు. కర్కాటకరాశిలో జన్మించిన వారికి 2025 సంవస్త్రం కి సంబంధించిన ఈ జాతకం వేదం జ్యోతిష్యశాస్త్రాన్ని ఉపయోగించి సృష్టించబడింది, ఇది గ్రహాల సంచారాలు ఇంకా కదలికలను గనిస్తుంది. కర్కాటకరాశి వారు 2025 లో ఎలాంటి పరిణామాలు ఆశించవొచ్చు ఇంకా వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
కర్కాటకరాశి 2025 జాతకం ప్రకారం 2025 సంవస్త్రం కర్కాటకరాశి వారి జీవితాల్లో ఎలాంటి మార్పులను తీసుకు వస్తుందో మరింత వివరంగా తెలుసుకుందాము.
2025 గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి!
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: कर्क 2025 राशिफल
కర్కాటకరాశిలో జన్మించిన వారి ఆర్ధిక పరిస్థితికి సంబంధించి కర్కాటకరాశి 2025 జాతకం లో మీరు 2025లో ఆర్ధిక విజయాన్ని సూచిస్తుంది. మీ విధి స్థానానికి అధిపతి అయిన బృహస్పతి సంవత్సరం ప్రారంభంలో మీ పదకొండవ ఇంట్లో ఉంటాడు. ఈ గ్రహ స్థానాల ఫలితంగా మీ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంవత్సరం ప్రారంభంలో శని మీ ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన మీరు డబ్బు గురించి ఆందోళన చెందుతారు కానీ మార్చిలో మీ తొమ్మిందవ ఇంటికి మారినప్పుడు ఆర్ధిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి. ఊహించని ధనం ఎక్కడా కనిపించదు. వీలునామాను స్వీకరించడం దాచిన నిధులను కనుగోనడం లేకపోతే ఒకరి ఆర్ధిక పరిస్థితి కి సంబంధించిన అదృష్ట సంఘటనలను అనుభవించే అవకాశం ఉంది. మేలో రాహువు తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది ఊహించని ఆర్ధిక ప్రతిఫలాన్ని కలిగిస్తుంది. డబ్బు ఖర్చుపెట్టేటపుడు మీరు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకరాశి 2025 జాతకం ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభంలో మీ తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు, శని ఇంకా కుజుడు ఉన్నందున ఈరాశిలో జన్మించిన వారి ఆరోగ్యానికి 2025 ప్రారంభ భాగం చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు రావచ్చు. కళ్ళు, కడుపు కి సంబంధించిన సమస్యలు ముఖ్యంగా స్పష్టంగా కనిపిస్తాయి. కర్కాటక 2025 రాశిఫలాలు యొక్క జాతకం ప్రకారం శని తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అయితే మేలో బృహస్పతి పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అటువంటి పరిస్థితులలో మీరు కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండాలి మరియు మీ ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. అక్టోబర్ లో బ్రూహస్పతి మీ రాశిలోకి ప్రవేశించినప్పుడు, మీ ఆరోగ్యానికి సంబంధించిన చింతలన్నీ తొలగిపోతాయి ఇంకా మీరు అసాధారణమైన ఆరోగ్యాన్ని పొందుతారు. మీరు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి. ఉదయాన్నే వాకింగ్ కి వెళ్ళడం అలవాటు చేసుకోండి అలాగే వీలైతే ఆరోగ్యకరమైన ఆహారాలు అధికంగా ఉండే సమతుల్య భోజనాన్ని తీసుకోండి.
Click here to read in English: Cancer 2025 Horoscope
కర్కాటకరాశి 2025 జాతకం ప్రకారం ఈ సంవత్సరం ఉద్యోగం చేసే వ్యక్తులు మార్చి నుండి కొత్త ఉపాధి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఉద్యోగం బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా మీకు లాభదాయకంగా ఉండటమే కాకుండా ఈ బదిలీ మీకు అనుకూలంగా పని చేస్తుంది. అదనంగా కొంతకాలం పనిచేసిన వ్యక్తులు మార్చిలో వారి ప్రస్తుత స్థితిని విడిచిపెట్టి బాగా చెల్లించే, స్థిరత్వం, గౌరవం మరియు సంపద ఉన్నా జీవితాన్ని బ్రతికే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మొదటి భాగం కూడా వ్యాపారులకు కొద్దిగా బలహీనంగా ఉంటుంది. చట్టం విషయానికి వస్తే మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార ప్రయోజనాల కోసం చేసే ప్రయాణాలు మార్చి నుండి లభిస్తాయి. ప్రయాణాలు మరియు వ్యాపార పురోగతి లభిస్తుంది.
కర్కాటకరాశికి చెందిన విద్యార్థుల విద్య గురుంచి మాట్లాడితే కర్కాటకరాశి 2025 జాతకం ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే బుధుడు ఐదవ ఇంట్లో ఉంటాడు ఇంకా మే నెల వరకు బృహస్పతి ఉంటాడు. ఇది మిమల్ని మరింత తెలివిగా మారుస్తుంది. మీరు మరింత సహజమైన జ్ఞానం కలిగి ఉంటారు. మీరు నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు. కర్కాటక 2025 రాశిఫలాలు యొక్క జాతకం పరంగాసాధారణ విద్యార్థులే కాదు, చదువు మానేసిన వ్యక్తులకు కూడా చదువుపై ఆసక్తి, కోరిక కలుగుతుంది. ఇది విభిన్న జ్ఞానాన్ని పొందే అవకాశాలను మీకు అందిస్తుంది. జ్యోతిష్యం ఇంకా ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక అవకాశాలు కూడా ఉండవచ్చు.
కర్కాటకరాశి 2025 జాతకం ప్రకారం మీ రాశిలో కూర్చున్న నీచ రాశి కుజుడి యొక్క ప్రభావం నాల్గవ ఇంటిపై ఉంటుంది, అంటే 2025 ప్రారంభం మీ కుటుంబ జీవితానికి కొద్దిగా సవాలుగానే ఉంటుంది. ఇది కాకుండా రెండవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు సంవత్సరం ప్రారంభంలో ఆరవ ఇంట్లో ఉంటాడు శని శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు ఈ పరిస్థితులన్ని కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉండవు, అందుకే మీరు కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీ తల్లికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తరువాత విషయాలు క్రమంగా మెరుగుపడతాయి కానీ సంవత్సరం మొదటి భాగం జాగ్రత్తగా ఉండాలి. దానిని అనుసరించి కుటుంబం క్రమంగా సామరస్యంగా జీవించడం ప్రారంభిస్తుంది ఇంకా మీరు కుటుంబంతో సామరస్యంగా జీవించడం కొనసాగిస్తారు దీని ఫలితంగా కుటుంబ జీవితం సమతుల్యమవుతుంది మీరు మీ కుటుంబ సభ్యుల ప్రేమ మరియు ఆప్యాయత ని అందుకుంటారు. ఆనందంతో నిండి ఉంటారు.
ఇక్కడ మీ భాగస్వామితో అల్టిమేట్ అనుకూలత పరీక్షను పొందండి!!
కర్కాటకరాశి 2025 జాతకం ప్రకారం వివాహితులకు సంవత్సరం ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో కుజుడు మీ రాశిలో ఉంటాడు ఇంకా ఏడవ ఇంటిని ఎదుర్కొంటున్నాడు, ఇది వివాహాలలో సమస్యలు అలాగే ఒత్తిడికి దారితీయవచ్చు. మీకు ఇంకా మీ భాగస్వామికి విభేదాలు మరియు వాగ్వాదాలు ఉండవచ్చు. మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి. కర్కాటక 2025 రాశిఫలాలులో జనవరి 21 నుండి కుజుడి తిరోగమనంలో పన్నెండవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, అది ఏడవ ఇంటిని చూపుతుంది. ఏప్రిల్ 3న కర్కాటకరాశికి తిరిగి వస్తుంది ఇంకా జూన్ 7 వరకు సింహరాశిలో ఉంటుంది. ఆ సమయంలో మీరు సమస్యలను ఎదుర్కొంటారు. అయితే జూలై 28 నుండి కన్యారాశిలో కుజుడు మీ మూడవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, వైవాహిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి మరియు మీరు శాంతిని పొందుతారు. మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్లడం ముఖ్యం. ఈసారి మీరిద్దరూ చాల దూరం ప్రయాణించే అద్భుతమైన అవకాశం ఉంది, ఇది మీ సంబంధాన్ని మరింతగా పెంచుకుని మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. బృహస్పతి అక్టోబర్ నుండి డిసెంబరు వరకు మీ రాశిలో ఐదవ, ఏడవ ఇంకా తొమ్మిదవ గృహాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది మీ పిల్లలకు సంతోషాన్ని కలిగిస్తుంది మరియు మీ వైవాహిక ప్రేమను పెంచుతుంది.
మీ కుండలి ప్రకారం అనుకూలీకరించిన మరియు ఖచ్చితమైన శని నివేదికను పొందండి!
మీ కర్కాటకరాశి 2025 ప్రేమ జాతకం ప్రకారం సంబంధాల పరంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. బుధుడు ఐదవ ఇంట్లో ఉంటాడు ఇంకా దానిపై బృహస్పతి యొక్క అంశం మీ శృంగార సంబంధాలను మెరుగుపరుస్తుంది. మీరు మీ సంబంధానికి మరింత విలువ ఇస్తారు అలాగే మీరు ఒకరి గురించి మరొకరు ఎలా భావిస్తున్నారనే దాని గురించి మరింత బహిరంగంగా ఉంటాడు. జూన్ మరియు జూలై మధ్య కుజుడు మీ రెండవ ఇంట్లో ఉంటాడు ఐదవ ఇంటిపై పూర్తి దృష్టిని ఇస్తుంది. సమస్యలను నివారించడానికి ఈ సమయంలో మీ వివాహం గురించి మీ బంధువులతో మాట్లాడటం మానుకోవాలి. దీన్ని అనుసరించి మీ శృంగార జీవితంలో విషయాలు మెరుగ్గా సాగుతాయి. మీరు ప్రేమ కోసం వివాహం చేసుకునే అవకాశం ఉంది మరియు అది మీ ప్రేమ జీవితం పెరుగుతుంది మరియు అభివృద్ధి చెందుతుంది, ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు బృహస్పతి ఐదవ మరియు ఏడవ గృహాలకు కలిపినప్పుడు.
కర్కాటకరాశి 2025 జాతకం గురించి మీరు తెలుసుకోవలసినది ఇది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఈ వ్యాసం మీకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుందని ఆశిస్తున్నాను!
1: 2025 లో కర్కాటకరాశి వ్యక్తులకు ఏం తీసుకొస్తుంది?
కర్కాటకరాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు.
2. 2025 లో కర్కాటకరాశి వారికి ఉద్యోగాలు వస్తాయా?
కర్కాటకరాశిలో జన్మించిన వారికి 2025 మార్చ్ తర్వాత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
3. 2025 లో కర్కాటకరాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?
2025లో కర్కాటకరాశి వారికి శృంగార సంబంధాల పరంగా అదృష్టాన్ని పొందుతారు. ఈ సంవస్త్రం మీకు ప్రేమ వివాహం కూడా జరగవొచ్చు.
Best quality gemstones with assurance of AstroCAMP.com More
Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Get your personalised horoscope based on your sign.