Author: Vijay Pathak | Last Updated: Thu 4 Dec 2025 10:42:51 AM
ఈ ప్రత్యేక ఆస్ట్రోక్యాంప్ వ్యాసంలో 2026 సంవత్సరంలో మీనరాశి వారి జీవితంలోని వివిధ ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఖచ్చితమైన అంచనాలను మీరు మీనం 2026 రాశిఫలాలు చదువుతారు. ఈ 2026 సూచన పూర్తిగా వేద జోతిష్యశాస్త్రం యొక్క గ్రహ గణనల పైన ఆధారపడి ఉంటుంది మరియు గ్రహాల కదలిక, నక్షత్ర రాశుల స్థానం, గ్రహాల సంచారాలు మరియు మరిన్నింటిని దృష్టిలో ఉంచుకుని మా అనుభవజ్ఞులైన జోతిష్యులు జోతిష్యుడు ఆస్ట్రోగురు మృగాంక్ మీనరాశి వ్యక్తుల కోసం ప్రత్యేకంగా తయారు చేసారు. 2026 సంవత్సరంలో మీనరాశి స్థానికులు జీవితంలోని వివిధ రంగాలలో ఎలాంటి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం.
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: मीन 2026 राशिफल
మీనరాశి 2026 జాతకం ప్రకారం మీరు వైవాహిక సంబంధంలో ఉనట్టు అయితే, మీకు ఎలాంటి ఫలితాలు లభిస్తాయో? మీ పనిలో అడ్డంకులు తలెత్తుతాయా లేదా విషయాలు పురోగామిస్తాయా? మీ కెరీర్ ఏ దిశలో వెళుతుంది? మీ ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంటుంది? వ్యాపారంలో వృద్ది ఉంటుందా లేదంటే అనేది తెలియాలా? మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? మీరు ఆర్థికంగా ఎలా భావిస్తారు? శ్రేయస్సు లేదంటే కొరత ఉంటుందా? కుటుంబ జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయి మరియు ఈ సంవత్సరం మీరు ఏ ప్రత్యేక నివారణలను అనుసరించాలి, ఇవన్ని మీరు మీనరాశి 2026 జాతకంలో నేర్చుకుంటారు. మీనరాశి 2026 జాతకం ప్రకారం మీనరాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉంటుందో వివరంగా అర్థం చేసుకుందాం.
2026 గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి !
మీ ఆర్ధిక జీవితం గురించి మాట్లాడితే మీనరాశి 2026 జాతకం 2026 సంవత్సరం మీ ఆర్ధిక విషయాలలో హెచ్చు తగ్గులు తెలుస్తుందని ప్రత్యేకంగా అంచనా వేస్తుంది. మొత్తంమీద ద్రవ్య లాభాల బలమైన సూచనలు ఉన్నాయి. సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు మీ పదవ ఇంట్లో ఉంటారు. మీరు మీ ఆర్ధిక పరిస్థితిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. పన్నెండవ ఇంటి పై బృహస్పతి కోణం ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది, కానీ పన్నెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. డిసెంబర్ 5 వరకు రాహువు పన్నెండవ ఇంట్లోనే ఉంటాడు, ఇది అనవసరమైన ఖర్చులకు దారితీయవచ్చు, కాబట్టి మీరు ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి మరియు మర్చి నెలల్లో మంచి ఆర్ధిక లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీనం 2026 రాశిఫలాలు ప్రకారం మీరు వ్యాపారం నుండి లాభం పొందవొచ్చు. వ్యాపారంలో చేసే పెట్టుబడులు ఆర్టిక ప్రయోజనాలను తీసుకురావొచ్చు అలాగే మీరు స్టాక్ మార్కెట్ నుండి కూడా సంపాదించవొచ్చు. దీనికి తోడుగా అనేక ఆర్టిక పథకాలు మీకు లాభాలను తెచ్చి పెట్టవచ్చు. సంవత్సరం మధ్యలో ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి, కాబట్టి మీరు మిమల్ని మీరు బాగా నిర్వహించుకోవాలి ఇంకా ఈ సమయంలో మీ ఆర్టిక ప్రణాళిక పైన శ్రద్ధ వహించాలి. ఏడాది పొడవునా మీ రాశిలో కూర్చున్న శని దేవుడు క్రమశిక్షణతో కూడిన ఇంకా స్థిరమైన జీవితాన్ని గడపాలి అని మేకు సలహా ఇస్తున్నాము. మీరు ఎంత క్రమశిక్షణతో ఉనట్టు అయితే జీవితంలోని ప్రతి అంశంలోనూ మీరు అంత ఎక్కువ విజయాన్ని పొందుతారు.
మీ పిల్లల కెరీర్ గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? ఇప్పుడే ఆర్డర్ చేయండి: కాగ్ని- ఆస్ట్రో రిపోర్ట్ !
మీన రాశిఫలాలు 2026 ప్రకారం ఈ సంవత్సరం ఆరోగ్యం పరంగా సగటుగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ సంవత్సరం పొడవునా డిసెంబర్ 5 వరకు రాహువు పన్నెండవ ఇంట్లో మరియు కేతువు ఆరవ ఇంట్లో ఉంటాడు. మీ ఆరోగ్య సంబంధిత సమస్యలను పెంచుతుంది. శని ఏడాది పొడవునా మీ రాశిలో స్థానం పొందుతారు, అందువలన మీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి ఇంకా మీరు దాని పైన ప్రత్యేక శ్రద్ధని వహించాల్సిన అవసరం ఉంటుంది. అక్టోబర్ 31 నుండి డిసెంబర్ చివరి వరకు మీ పాలక గ్రహం అయిన బృహస్పతి ఆరవ ఇంలో కేతువుతో కలిసి ఉనప్పుడు మీ ఆరోగ్య సమస్యలను పెంచే అవకాశం ఉంది. కొవ్వు పేరుకుపోవడం, ఉబకాయం, ఆహార సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ పెరుగుదల, కడుపు సంబంధిత వ్యాధులు, అజీర్ణం, ఆమ్లత్వం మరియు ఇలాంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కొవ్వు ప్రేరిత అనారోగ్యాలు మరియు బరువు పెరగడం వంటి సనస్యలను కూడా మీరు ఎదుర్కోవచ్చు. మీ ఆరోగ్యాన్ని బలొపేతం చేయడానికి, మీరు సంవత్సరం ప్రారంభం నుండే శ్రద్ధ వహించడం ప్రారంభించాలి. మీరు మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా చేర్చుకోవాలి. ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలను నివారించవచ్చు. కళ్ళలో నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది, కాబట్టి మీరు ఏడాది పొడవునా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
మీ జాతకం ఆధారంగా ఖచ్చితమైన శని నివేదికను పొందండి!
మీనరాశిఫలాలు 2026 ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభం మీ కెరీర్‌లో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది, ఎందుకంటే నాలుగు గ్రహాలు సూర్యుడు,కుజుడు,బుధుడు మరియు శుక్రుడు మీ పదవ ఇంట్లో ఉంటారు. వాటిలో,అరవ ఇంటి అధిపతి సూర్యుడు కూడా ఉంటాడు. కేతువు ఆరవ ఇంట్లో ఉంటాడు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు బృహస్పతి నాల్గవ ఇంట్లో ఉండి మీ పదవ ఇంటిని చుస్తాడు ఇది మీ పని నుండి ప్రయోజనం పొందటానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి,అనేక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడానికి మరియు సమస్యలను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. అదే సమయంలో కొంతమంది ప్రత్యర్థులు కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉండవచ్చు. జూన్ 2 మరియు అక్టోబర్ 31 మధ్య బృహస్పతి ఐదవ ఇంటికి వెళ్ళినప్పుడు, మీరు ఉద్యోగ మార్పుకు అర్హులు అవుతారు. మీనం 2026 రాశిఫలాలు ప్రకారం ఈ కాలంలో మీరు ఉద్యోగాలు మార్చుకోవాలనుకుంటే, మీకు మంచి జీతంతో మంచి ఆఫర్ రావచ్చు, ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. సంవత్సరంలో చివరి రెండు నెలల్లో మీరు పనిలో మరియు ప్రత్యర్థుల నుండి వైరుధ్యాల గురించి అప్రమత్తంగా ఉండాలి. సహోద్యోగులతో సమస్యలు పెరగకుండా ఉండండి. మీన రాశి 2026 జాతకం ప్రకారం వ్యాపారంలో పాల్గొన్న వారికి, సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగితే, మీ వ్యూహాలు విజయవంతమవుతాయి. సంవత్సరం మొదటి అర్ధభాగం ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది, వ్యాపారంలో మంచి పురోగతిని తెస్తుంది. ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు ఆ సమయంలో ఎటువంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.
వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి: 2026 రాశిఫలాలు
మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం ఆశాజనకంగా కనిపిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో ఏ గ్రహం మీ ఐదవ ఇంటి వైపు చూడదు. కుజుడు మాత్రమే దాని పైన దృష్టి పెడతాడు,ఇది మీ మనస్సున కొంచెం అసంతిలోకి నెట్టవచ్చు. మీరు శని ప్రభావంలో ఉంటారు, ఎందుకంటే శని మీ రాసిలో స్థానం పొందుతాడు ఇది మీకు క్రమశిక్షణతో చదువుకోవడానికి సహాయపడుతుంది. స్థిరమైన అభ్యాసం మరియు క్రమం తప్పకుండ అధ్యయనం చేయడం అద్భుతమైన విద్య ఫలితాలను తెస్తాయి కాబట్టి మీరు దీని నుండి ప్రయోజనం పొందుతారు. మీనం 2026 రాశిఫలాలు ప్రకారం జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు, బ్ర్హసపతి మీ ఐదవ ఇంట్లో కర్కాటకంలో నివసిస్తుంది ,ఇది దాని ఉన్నతికి సంకేతం, ఇది విద్యలో గొప్ప విజయాన్ని తెస్తుంది మరియు మీకు ఒక ముఖ్యమైన విజయాన్ని కూడా ఆశీర్వదించవచ్చు. విద్యాపరంగా బాగా రాణించినందుకు మీరు ఒక రకమైన అవార్డు లేదంటే ప్రశంసలను పొందవచ్చు. స్కాలర్‌షిప్‌ల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఈ కాలంలో ఒకటి పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కఠినమైన సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. వారు ఒకటి లేదంటే రెండు పరీక్షలలో ఉత్తీర్ణులు కాకపోవచ్చు, కానీ వారు ఆశను కోల్పోకూడదు మరియు వారి ప్రయత్నాలను కొనసాగించాలి. పట్టుదల చివరికి విజయానికి దారి తీస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించే వారికి, సంవత్సరం ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది మరియు మీ కృషి మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు విదేశాలలో చదువుకోవాలనుకుంటే, సంవత్సరం మధ్య భాగం ఆ దిశలో మీకు విజయాన్ని తెచ్చిపెట్టవచ్చు.
Click here to read in English: Pisces 2026 Horoscope
మీనరాశి ఫలాలు 2026 ప్రకారం 2026 సంవత్సరం మీ కుటుంబ జీవితానికి మి శ్రమ ఫలితాలను తెస్తుంది. సంవత్సరం ప్రారంభంలో మీ రెండవ ఇంటి అధిపతి అయిన కుజుడు సూర్యుడు,బుధుడు మరియు సుక్రులతో పటు పదవ ఇంట్లో ఉంటాడు. శని సంవత్సరం పొడవున మీ పదవ మరియు మూడవ ఇళ్ళను చుస్తాడు. సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు బ్ర్హస్పతి మీ నాల్గవ ఇంట్లోనే ఉంటాడు. ఈ గ్రహ స్థానాలు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు గౌరవం చెక్కుచెదరకుండా ఉంటాయని సూచిస్తున్నాయి. కొన్ని విభేదాలు క్రమంగా తలెత్తవచ్చు, సంవత్సరం మధ్యలో వాటి గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది, ఇది కుటుంబంలో కొన్ని సమస్యలను సృష్టించవచ్చు. సంవత్సరం ప్రారంభంలో మీ తండ్రికి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు, కాబట్టి మీరు అతని శ్రేయస్సు పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో అతని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మరియు ఇంట్లో సామరస్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడతాయి. మీ తోబుట్టువుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. వారు మీకు ఆర్థికంగా కూడా సహాయం చేయవచ్చు మరియు అనేక పనులలో మీకు సహాయం చేయవచ్చు. మీ బంధాన్ని బలోపేతం చేయవచ్చు మరియు మీ మధ్య ఆప్యాయత మరియు వెచ్చదనాన్ని పెంచుకోవచ్చు. మీ తల్లి నుండి ఒక సలహా మీకు చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు మరియు ఆమె ఆశీర్వాదాలు ఈ సంవత్సరం అనేక ముఖ్యమైన పనులను సాధించడంలో మీకు సహాయపడతాయి.
మీనరాశి ఫలాలు 2026 ప్రకారం ఈ సంవత్సరం వివాహిత స్థానికుల పట్ల ప్రేమతో నిండి ఉంటుంది, కానీ దీనికి జాగ్రత్త కూడా అవసరం. మీ సంబంధానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వడంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామిని గౌరవించండి, వారి మాట వినండి మరియు వారి సూచనలను అనుసరించడానికి ప్రయత్నించండి ఎందుకంటే వారు మీ నిజమైన జీవిత భాగస్వామి మరియు వారు ఎప్పటికీ మీకు తోడుగా ఉంటారు. ఒకరికొకరు నిజమైన గౌరవం ఇవ్వడం వల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది. మార్చి నుండి ఏప్రిల్ వరకు మీ మధ్య కొంత కక్ష పెరుగుతుంది. కొన్ని విషయాల పైన సమస్యలు తలెత్తవచ్చు మరియు జూన్ నాటికి ఈ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. మీరు విషయాలను ప్రశాంతంగా చూసి పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి ప్రశాంతంగా చూసి పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తే విషయాలు జరగడానికి లేదా జరగకపోవడానికి ఎల్లప్పుడూ ఒక కారణం ఉంటుందని మీరు గ్రహిస్తారు. ఆ కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామికి విలువ ఇవ్వండి మరియు వారు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.అప్పుడు వారు ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తారని మీరు చూస్తారు. మీనం 2026 రాశిఫలాలు ప్రకారం మీ దృక్పథం పరిణతి చెందుతున్నప్పుడు, సంవత్సరం చివరి నెలల్లో, మీరు కలిసి నాణ్యమైన సమయాన్ని గడపగలరని మీరు గమనించవచ్చు, ఇది మీ సంబంధంలో కొత్త శక్తిని తెస్తుంది మరియు మీ వివాహ జీవితాన్ని అందంగా వికసిస్తుంది.
మీనరాశి ఫలాలు 2026 ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభంలో మీ ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు ఎదురుకోవాల్సిన అవసరం రావొచ్చు, ఎందుకంటే కుజుడు మీ ఐదవ ఇంటికి చూస్తాడు, ఇది సంబంధాలలో తీవ్రత మరియు దూకుడును పెంచుతుంది. మీరు మీ ప్రియమైన వారితో వాదనలు లేదంటే విభేదాలను ఎదురుకోవొచ్చు మరియు ఇతరుల జోక్యం కూడా మీ మధ్య సమస్యలను సృష్టించవచ్చు. మీ సంబంధం సజావుగా సాగడానికి ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఈ దశ తర్వాత ఈ సంవత్సరం మధ్య నాటికి మీ సంబంధం మెరుగుపడటం ప్రారంభం అవుతుంది. జూన్ 2 నుండి బృహస్పతి మీ ఐదవ ఇంట్లోకి ప్రవేశించి అక్టోబర్ 31 వరకు అక్కడే ఉంటాడు. మీ ప్రేమను వికసించి, వర్ధిల్లేలా చేస్తుంది. మీ మధ్య అపార్థాలు తగ్గుతాయి. మీరు కలిసి తగినంత సమయం గడుపుతారు మరియు సుదీర్గమైన అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొంటారు. మీరు మీ సంబంధాన్ని మరింత విలువైనదిగా భావించడం ప్రారంభిస్తారు మరియు మీరు నిజంగా ఒకరికొకరు ఉద్దేశించినవారని గ్రహిస్తారు. ఈ అవగాహన మీ మధ్య నమ్మకాన్ని బలపరుస్తుంది మరియు మీ ప్రేమ హృదయం నుండి మరింత లోతుగా ఉంటుంది. మీరు మీ భాగస్వామికి దగ్గరగా పెరుగుతారు, గత దూరాలను వదిలివేసి, మీ సంబంధంలో ఎక్కువ సామరస్యంతో ముందుకు సాగుతారు.
గురువారం రోజున మీ నుదిటి పైన కుంకుమ తిలకం వేయండి.
మీనం 2026 రాశిఫలాలు సోమవారం రోజున శివుడికి జలాభిషేకం చేయండి.
మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి నాలుగు మోతీచూర్ లడ్డులను సమర్పించండి.
మంగళవారం రోజున చిన్న పిల్లలకు బూందీ లేదంటే బెల్లం-చనా ప్రసాదం పంపిణి చేయండి.
నాణ్యమైన రత్నాలు, యంత్రాలు మరియు జ్యోతిష సేవలను ఆన్‌లైన్‌లో కొనండి: ఇక్కడ క్లిక్ చేయండి !
ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. ఆస్ట్రోక్యాంప్ తో కనెక్ట్ అయి ఉన్నందుకు ధన్యవాదాలు.
1.మీనరాశిని పాలించే గ్రహం ఎవరు?
మీనరాశిని పాలించే గ్రహం బృహస్పతి.
2. 2026 లో శని ఏ రాశిలో ఉంటుంది?
మీనరాశి 2026 జాతకం ప్రకారం 2026 సంవత్సరం అంతా శని మీన రాశిలోనే ఉంటుంది.
3.మీనరాశి స్థానికుల కెరీర్ 2026లో సంవత్సరం ఎలా ఉంటుంది?
2026 సంవత్సరంలో మీనరాశి వ్యక్తుల కెరీర్ అనుకూలంగా ఉంటుంది, కొంత జాగ్రత్త అవసరం.
Best quality gemstones with assurance of AstroCAMP.com More
Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Get your personalised horoscope based on your sign.