Author: Vijay Pathak | Last Updated: Thu 6 Nov 2025 4:48:11 PM
ఈ ప్రత్యేక ఆస్ట్రోక్యాంప్ వ్యాసంలో 2026 సంవత్సరంలో సింహరాశి వారి జీవితంలోని వివిధ ప్రాంతాలలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఖచ్చితమైన అంచనాలను మీరు సింహం 2026 రాశిఫలాలు చదువుతారు. ఈ అంచనాలు పూర్తిగా వేద జోతిష్యశాస్త్ర గణనలపై ఆధారపడి ఉంటాయి, వీటిని మా జోతిష్యుడు జోతిష్యుడు ఆస్ట్రోగురు మృగాంక్జాగ్రత్తగా తయారు చేశారు, గ్రహాల సంచారాలు, జోతిష్యశాస్త్ర గణనలు, నక్షత్రాల కదలికలు మరియు నక్షత్రాల స్థానాన్ని విశ్లేషించిన తర్వాత దీనితో మీరు అర్ధం చేసుకోగలరు. సింహారాశి 2026 రాశిఫలం ప్రకారం మీ ప్రేమ జీవితం, వైవాహిక జీవితం, వృత్తి, ఆర్థికం, ఆరోగ్యం మరియు విద్యలో ఫలితాల గురించి మీరు వివరంగా తెలుసుకుంటారు. మీ కుటుంబ జీవితం ఏ దిశలో అభివృద్ది చెందుతుందో కూడా మీరు నేర్చుకుంటారు.
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: सिंह 2026 राशिफल
2026 గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి!
సింహరాశి వారి ఆర్థిక జీవితాన్ని పరిశీలిస్తే, 2026 జాతకం ప్రకారం, జూన్ 2 వరకు బృహస్పతి మీ పదకొండవ ఇంట్లో ఉంటాడు కాబట్టి, సంవత్సరం ప్రారంభం మీకు ఆర్థిక విషయాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుందని అంచనా. జనవరి 11 నుండి మార్చి 11 వరకు, బృహస్పతి తిరోగమనంలో ఉంటుని, ఆ తర్వాత అది నేరుగా కదులుతుంది. సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు ఐదవ ఇంట్లో ఉంచబడి మీ పదకొండవ ఇంటిని చూస్తారు. ఈ గ్రహ స్థానాల ఆధారంగా మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా పెరుగుతూనే ఉంటుంది. మీకు గ్రహాళ్ల మద్దతు లభిస్తుందిమరయు మీ ఆదాయం గణనీయమైన వృద్దిని చూస్తుంది. అయితే, ఎనిమిదవ ఇంట్లో ఉంచబడిన శని కొన్ని ఖర్చులకు కారణమవుతూనే ఉంటుంది. జూన్ 2 మరియు అక్టోబర్ 31 మధ్య, బృహస్పతి పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు, ఇది మంచి మరియు శుభ పనులపై ఖర్చు చేయడానికి పరిస్థితులను సృష్టిస్తుంది. మీరు సంవత్సరం ప్రారంభం నుండే మీ ఆర్థిక వ్యవహారాలను సరిగ్గా నిర్వహిస్తే, మీరు అంతటా డబ్బు కొరతను ఎదురకోరు. సంవత్సరం ప్రారంభం నుండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉండవచ్చు.
మీ పిల్లల కెరీర్ గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? ఇప్పుడే ఆర్డర్ చేయండి: కాగ్ని- ఆస్ట్రో రిపోర్ట్!
ఆరోగ్య దృక్కోణం నుండి 2026 సంవత్సరం సింహరాశి వారికి కడుపు సంబంధిత సమస్యలతో ప్రారంభం కావచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఐదవ ఇంటి పైన ఆరు గ్రహాల ప్రభావం జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తీసుకురావచ్చు. సింహం 2026 రాశిఫలాలు ప్రకారం మీరు మీ ఆహారపు అలవాట్లపై చాలా శ్రద్ధ వహించాలి. మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి బయటి ఆహారం పాత భోజనం లేదా అధికంగా వేయించిన మరియు నూనె పదార్థాలు తినడం కొనసాగిస్తే, ఈ సంవత్సరం మీ కడుపు మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొవ్వు సంబంధిత సమస్యలు మీ బరువును పెంచుతాయి మరియు కడుపు ఇన్స్పెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. శని ఎనిమిదవ ఇంట్లో ఉండటం మరియు బృహస్పతి సంవత్సరం మధ్యలో పన్నెండవ ఇంట్లోకి మారడం వల్ల ఆరవ మరియు ఎనిమిదవ ఇళ్లతో సంబంధాలు ఏర్పడతాయి, కడుపు సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. జూన్ నుండి అక్టోబర్ చివరి వరకు మీరు మీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ నుండి జూన్ వరకు మరియు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు కాలాలు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి మరియు మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా కొలుకోవచ్చు.
మీ జాతకం ఆధారంగా ఖచ్చితమైన శని నివేదికను పొందండి!
సింహారాశి ఫలం 2026 ప్రకారం మీ కెరీర్ విషయానికి వస్తే ఎనిమిదవ ఇంట్లో ఉన్న శని, ఏడాది పొడవునా మీ పడవ ఇంటిపై తన దృష్టిని ప్రయోగిస్తాడు. పని ఒత్తిడి మీ పైన తన దృష్టిని ప్రయోగిస్తాడు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం మధ్యకాలం వరకు బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండటంతో, మీరు సీనియర్ ధికారుల నుండి మద్దతు మరియు ప్రయోజనాలను పొందుతారు. ఈ సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీరు వారి ప్రశంసలను పొందుతారు, ఇది సంవత్సరం మధ్యలో మీకు ప్రమోషన్ను తెస్తుంది. దీనిని సాధించడానికి మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. మీరు వ్యాపారంలో సంవత్సరం ప్రారంభం నుండి డిసెంబర్ 5 వరకు రాహువు మీ ఏడవ ఇంట్లో ఉంటాడు, అయితే ఏడవ ఇంటి అధిపతి శని ఏడాది పొడవునా ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు. ఈ కలయిక వ్యాపారంలో హెచ్చుతహహులు మరియు ఆకస్మిక మార్పులను సూచిస్తుంది. మీరు మరియు ఆకస్మిక మార్పులను సూచిస్తుంది. మీరు తీసుకునేఏవైనా నిర్ణయాలు తొందరపడకూడదు. మీరు చర్య తీసుకునే ముందు విషయ నిపుణులు మరియు అత్యంత అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహా తీసుకుంటే, మీరు మంచి వ్యాపార వృద్ధిని చూడవచ్చు. అక్టోబర్ 31 నుండి, బృహస్పతి మీ రాశిలోకి ప్రవేశించి మీ ఏడవ ఇంటి పైన తన కారకాన్ని ప్రయోగిస్తాడు, వ్యాపారంలో విస్తరణ మరియు పురోగతికి బలమైన అవకాశాలను సృష్టిస్తాడు.
వివరంగా చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి:2026 రాశిఫలాలు
సింహారాశి విద్యార్థులకు సంవత్సరం ప్రారంభం కొంచెం బలహీనంగా ఉండవచ్చు, ఎందుకంటే బుధుడు, శుక్రుడు, కుజుడు మరియు సూర్యుడు మీ నాల్గవ ఇంట్లో ఉంటారు మరియు ఎనిమిదవ ఇంట్లో ఉన్న శని వారిపై తన దృష్టిని ప్రయోగిస్తాడు. విద్యలో హెచ్చుతగ్గులు సంభవించవచ్చు. మీ దృష్టి పదే పదే తడబడుతుంది మరియు మీరు చదువు పైన ఆసక్తి కోల్పోవచ్చు, ఇది మీ విద్యా పురోగతిలో సవాళ్లకు దారితీస్తుంది. ఈ సంవత్సరం మధ్యకాలం వరకు బృహస్పతి మీ ఐదవ ఇంటిని దృష్టిలో ఉంచుకోవడంతో, నేర్చుకోవాలనే మీ ఉత్సాహం చెక్కుచెదరకుండా ఉంటుంది మరియు మీరు మీ చదువును కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సింహం 2026 రాశిఫలాలు ప్రకారం మీరు పోటీ పరీక్షలకు సిద్దామవుతుంటే, మీరు చాలా కష్టపడి పనిచేయాలి, ఎందుకంటే ఈ సంవత్సరం మీకు మంచి విజయాన్ని తెచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు సవాళ్లను ఎదుర్కొంటారు, కానీ వాటిని అధిగమించడం ద్వారా, మీరు సాధనకు మార్గాన్ని కనుగొంటారు. ప్రయత్నం లేకుండా ఏమీ సాధించబడదు, కాబట్టి ప్రతిఫలదాయకమైన ఫలితాలను పొందడానికి మీరు మీ తోటివారి కంటే కష్టపడి పనిచేయాలి. మీరు విదేశాలలో చదువుకోవాలని ప్లాన్ చేస్తుంటే, సంవత్సరం మధ్యలో విజయానికి అవకాశాలు రావచ్చు, కాబట్టి ఈ దిశలో సకాలంలో ప్రయత్నాలు చేయండి మరచిపోవద్దు.
Click here to read in English: Virgo 2026 Horoscope
సింహారాశి 2026 ప్రకారం 2026 సంవత్సరం మీ కుటుంబ జీవితానికి సాగాటుగా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం మధ్యకాలం వరకు బృహస్పతి కోణం మీ మూడవ ఇంటి పైన ఉంటుంది, ఇది మీ తోబుట్టువులతో మీ బంధాన్ని బలోపేతం ఉంటుంది మరియు వారు మీ అన్ని ప్రయత్నాలలో మీకు మద్దతు ఇస్తారు. శని కోణం ఏడాది పొడవునా మీ రెండవ ఇంటిపై ఉంటుంది. ప్రేమ సాధారణంగా కుటుంబంలోనే ఉంటుంది, కానీ ప్రజలు తమకు తాము ఎటువంటి హానిని చూడనంత వరకు మాత్రమే ఒకరినొకరు వింటారు. అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి మీ రాశిలోకి ప్రవేశించినప్పుడు, మీరు ఆధ్యాత్మిక మరియు మతం వైపు కొంత ఎక్కువ మొగ్గు చూపుతారు. మీరు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ సంవత్సరం మీ తండ్రి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు, కాబట్టి మీరు అతనిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం ప్రారంభంలో మీ తల్లి ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు, కానీ సంవత్సరం మధ్యకాలం తర్వాత, గణనీయమైన మెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీ కుటుంబంలోకి కొత్త వాహనం ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం మధ్యలో కొన్ని శుభ వేడుకలు లేదా మతపరమైన ఆచారాలు కూడా జరగవచ్చు. పిల్లల పుట్టుక కూడా కుటుంబంలో ఆనందాన్ని తెస్తుంది.
సింహారాశి 2026 ప్రకారం 2026 లో మీ వైవాహిక జీవితం ఒడిదుడుకులతో నిండి ఉండవచ్చు. మీ జీవితంలో దాదాపు ప్రతి క్షణం సవాలుగా అనిపిస్తుంది. మీరు ప్రేమను మరియు ఇతర సమయాల్లో సమస్యలను అనుభవిస్తారు, ఎందుకంటే రాహువు మీ ఏడవ ఇంట్లో డిసెంబర్ 5 వరకు ఏడాది పొడవునా ఉంటాడు మరియు ఏడవ ఇంటి అధిపతి శని మీ ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు. మీరు అత్తమామలను కలవడం కొనసాగిస్తారు, కానీ కొన్ని విషయాలు వారితో విభేదాలకు దారితీయవచ్చు. ఏడవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి కొంతవరకు ఆధిపత్యం చెలాయించవచ్చు, అయితే మీ రాశిలో కేతువు ఉండటం వల్ల సందేహాస్పద పరిస్థితులు ఏర్పడవచ్చు. సింహం 2026 రాశిఫలాలు ప్రకారం ఈ విషయంలో ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతానికి బృహస్పతి సంవత్సరం మధ్యకాలం వరకు మీకు మద్దతు ఇస్తాడు. జూన్ ప్రారంభం నుండి అక్టోబర్ చివరి వరకు, బృహస్పతి పన్నెండవ ఇంటలోకి వెళ్ళే వరకు, మీ వైవాహిక సంబంధంలో సమస్యలు తీవ్రమవుతాయి. అక్టోబర్ చివరి నాటికి, బృహస్పతి మీ రాశిలోకి ప్రవేశించి ఏడవ ఇంటిపై తన కారకాన్ని ఉంచినప్పుడు, ఈ సవాళ్లు తగ్గుతాయి, పరస్పర అవగాహన మెరుగుపడుతుంది మరియు మీ సంబంధం తిరిగి గాడిలో పడుతుంది.
సింహారాశి 2026 జాతకం ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు మీ ప్రేమ జీవితంలో గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. బహుళ గ్రహాల ప్రభావం మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. మీరు వీలైనంత ఎక్కువ సమయం కలిసి గడపాలని కోరుకుంటారు. మీరు మీ ప్రియమైన వ్యక్తిని మీ కుటుంబం మరియు స్నేహితులకు పరిచయం చేయకుండా కూడా ప్రయత్నించవచ్చు. సరైన అవకాశం కోసం వేచి ఉండటం ముఖ్యం. తప్పు సమయంలో అలాచేయడం వల్ల మీకు సమస్యలు తలెట్టవచ్చు. మీరు మరికొంత మందిపై ఆసక్తిని పెంచుకోవచ్చు. అలాంటి సంబంధాలను స్నేహానికే పరిమితం చేసుకోవడం మంచిది, లేకుంటే, అవి మీ జీవితాన్ని క్లిష్టతరం చేస్తాయి. సంవత్సరం చివరి త్రైమాసికంలో, మీరు మీ భాగస్వామితో కలిసి సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు మరియు మీ ప్రేమను బహిరంగంగా వ్యక్తపరుస్తారు. మీ సంబంధంలో నమ్మకం యొక్క బంధం బాలపడుతుంది. సింహం 2026 రాశిఫలాలు ప్రకారం మీరు మీ భాగస్వామీ వివాహం చేసుకోవాలనుకుంటే, సంవత్సరం చివరి త్రైమాసికం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు వివాహ ప్రతిపాదన చేస్తే, మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని తిరస్కరించలేరు. అవివాహితులైన స్థానికులకు సంవత్సరం చివరి త్రైమాసికంలో వివాహం జరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి. మీరు మీ పై మరియు మీ సంబంధం పై నమ్మకం ఉంచుకోవాలి.
నాణ్యమైన రత్నాలు, యంత్రాలు మరియు జ్యోతిష సేవలను ఆన్‌లైన్‌లో కొనండి: ఇక్కడ క్లిక్ చేయండి!
ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. ఆస్ట్రోక్యాంప్ తో కనెక్ట్ అయి ఉన్నందుకు ధన్యవాదాలు.
1.సింహరాశి వారికి అధిపతి ఎవరు?
సూర్యుడు.
2.సింహరాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?
మీరు మీ ప్రేమ జీవితంలో గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు.
3.2026లో సింహరాశి వారు ఏ నివారణలు పాటించాలి?
ప్రతిరోజూ శ్రీ సూర్యాష్టకం పారాయణం చేయండి.
Best quality gemstones with assurance of AstroCAMP.com More
Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Get your personalised horoscope based on your sign.